- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ విషయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తన మనసు మార్చుకుంది. జూన్ 3 వరకు తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడతారని స్పష్టం చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు తమ సన్నాహక సమయాన్ని తగ్గించుకునేందుకు దక్షిణాఫ్రికా నిర్ణయం తీసుకుంది. గతంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం మే 26నే స్వదేశానికి పంపాలని బీసీసీఐని కోరింది. తమ మొదటి ప్రాధాన్యం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అని పేర్కొంది. కానీ తాజాగా ఈ విషయంలో యూటర్న్ తీసుకోవడంతో ఐపీఎల్ జట్లకు ఊరట లభించింది.
- Advertisement -