- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: WCL- 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా నిలిచింది. ENGలోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. SA 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ABD సెంచరీ, డుమినీ హాఫ్ సెంచరీతో రాణించారు. ABD 60 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 120 రన్స్ చేశారు. టైటిల్ గెలుపుతో సౌతాఫ్రికా ప్లేయర్లు సంబరాల్లో మునిగారు.
- Advertisement -