- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలో బుధవారం కురిసిన వర్షానికి మండలకేంద్రంలో గల మార్కెట్ యార్డులో ఆరబెట్టిన సోయా చిక్కుడు పంట తడిసిపోయింది. టార్పాలిన్లతో కప్పి కాపాడుకునేందుకు ప్రయత్నించినా, పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంటను విక్రయని మార్కెట్ కు తెస్తే ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాక పోవడంతో ఇబ్బంది ఏర్పడిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు.
- Advertisement -