Saturday, October 11, 2025
E-PAPER
Homeజాతీయంఐపీఎస్ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

ఐపీఎస్ పూరన్‌ కుమార్‌ ఆత్మహత్య కేసులో ఎస్పీపై వేటు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తీవ్ర కుల‌వేధింపుల కారణంగా హర్యానాలో మంగళవారం ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై అధికారులు వేటు వేశారు. సూసైడ్‌లో మృతుడు పేర్కొన్న పేర్లు ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రోహ్‌తక్‌ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై వేటు వేసింది. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ సహా ఎనిమిది మంది సీనియర్ అధికారులపై సూసైడ్ నోట్‌లో కుల ఆధారిత వివక్ష, మానసిక వేధింపులు, బహిరంగ అవమానాలు, దౌర్జన్యాలపై సూసైడ్ నోట్‌లో మృతుడు ఆరోపించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -