Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅధికారులను ఘనంగా సత్కరించిన ఎస్పీ 

అధికారులను ఘనంగా సత్కరించిన ఎస్పీ 

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి: పోలీస్ శాఖలో 36 ఏండ్లుగా సేవలందించి శనివారం పదవీ విరమణ పొందిన ఇద్దరు ఏఎస్సైలను శనివారం  జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖరే  ఘనంగా సత్కరించి, గృహపకరణాలు అందజేశారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పల్నాటి  సాంబయ్య, ఘనపురం  పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న పోరిక రతన్ సింగ్ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు తమ శేషజీవితాన్ని  కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

సుమారు 36 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలందించిన అధికారుల అనుభవాలను నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన అధికారులు సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.పోలీసు శాఖ నుండి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విశ్రాంత ఉద్యోగులుతమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పి ఏ నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు రత్నం, శ్రీకాంత్, కిరణ్, పోలీసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, విశ్రాంత ఏఎస్సైల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad