నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్-అమెరికా దేశాల్లో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధాన్ని వెంటనే ఆపాలని, నో కింగ్స్ పేరిట ఉద్యమం ఊపు అందుకుంది. ఈక్రమంలోనే స్పెయిన్ దేశం అమెరికాకు భారీ షాకిచ్చింది. ఇరాన్‌పై దాడులకు తమ దేశ గగనతలాన్ని యూఎస్ ఉపయోగించకోవడానికి వీలులేదని, అమెరికా యుద్ధ విమానాలకు ఎయిర్పేస్ను మూసివేశామని స్పష్టం చేసింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడులు అన్యాయమని, పశ్చిమాసియా యుద్ధాన్ని తమ పీఎం వ్యతిరేకించారని, అది పూర్తిగా అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం, అన్యాయమని చెప్పారని స్పెయిన్ డిఫెన్స్ మినిస్టర్ మార్గరిటా రోబ్లెస్ ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా, దక్షిణ స్పెయిన్‌లోని రోటా, మోరోన్ సైనిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవడానికి స్పెయిన్ ప్రభుత్వం నిరాకరించడంతో, 15 అమెరికా విమానాలు వేరే చోటికి తరలివెళ్లవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాడ్రిడ్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించారు.



