Tuesday, November 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ నెల 6న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

ఈ నెల 6న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగనుంది.. నవంబర్ 6న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆరికెపూడి గాంధీల పిటిషన్ల విచారణ జరుగుతుంది.. 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ ల పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది.. 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు.. రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గతంలో సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తైంది. దీంతో మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని.. అంతర్జాతీయ సదస్సులు ఉండటంతో గడువు సరిపోలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -