- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాలి. నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్ధమైంది. మొత్తం పదిమందిలో ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంలపై తాజాగా వాదనలు పూర్తి కాగా నేటి స్పీకర్ తీర్పు ఎలా ఉండబోతుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -



