Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంవేసవి దృష్ట్యా వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

వేసవి దృష్ట్యా వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

- Advertisement -

– అగ్ని ప్రమాదాలను నివారించాలి : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వేసవి దృష్ట్యా వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అధికారులను రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి సీపీఎఫ్‌లు, డీఎఫ్‌ఓలతో మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ఏం పరికరాలు వాడుతున్నారని ఆరా తీశారు. ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అని తెలుసుకున్నారు. ఏ జిల్లాలో ఎక్కువ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి? వాటి వల్ల వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని అడిగారు. వేసవి దృష్ట్యా అడవుల్లో, జూ లలో వన్యప్రాణుల, ఇతర జంతవులకు తగిన తాగునీటి సదుపాయాల కల్పించారా? అని ప్రశ్నించారు. వేసవిలో జంతువుల కోసం 2,168 నీటి గుంతలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నట్టు అధికారులు వివరించారు.
నెహ్రూ, వరంగల్‌ జూ పార్కులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. వన్యప్రాణులకు నీటి సౌకర్యం, ఆహారం విషయంలో అశ్రద్ధ వహించద్దని ఆదేశించారు. ప్రత్యేకంగా నీటి లభ్యత ఉన్న ఆహార పదార్థాలు, పండ్లను(దోసకాయ, పుచ్చకాయ వంటి) వాటికి ఆహారంగా అందజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీఎఫ్‌(హెఓఎఫ్‌ఎఫ్‌) డాక్టర్‌.సువర్ణ, పీసీసీఎఫ్‌ (వైల్డ్‌ లైఫ్‌) ఈలు సింగ్‌ మేరు, పీసీసీఎఫ్‌( స్కీమ్స్‌) జవహర్‌, వైల్డ్‌ లైఫ్‌ ఓఎస్డీ శంకరన్‌, నెహ్రూ జూ పార్క్‌ డైరెక్టర్‌ సునీల్‌ హీరామత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -