- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్: మహానీయులు మహాత్మ జ్యోతిరావు పూలే,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈ రోజు ఆలేరు పట్టణంలోని వైఎస్ఎన్ గార్డెన్‌లో ఉదయం 10 గంటలకు ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ (ఎం) నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ హాజరుకానున్నారు. విశిష్ట అతిథిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పాల్గొంటారు. సమాజంలో సమానత్వం, విద్యా ప్రాధాన్యం, హక్కుల సాధన కోసం పూలే, అంబేద్కర్ చేసిన సేవలను ఈ సదస్సులో గుర్తుచేసుకుంటారని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -



