Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్జగదీశ్వర్‌ రావుకు ప్రత్యేక అభినందనలు

జగదీశ్వర్‌ రావుకు ప్రత్యేక అభినందనలు

- Advertisement -

నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పద్మశాలి ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సంగిశేట్టి జగదీశ్వర్‌ రావును శనివారం గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు మస్న రవి కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత పూల మాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, హైదరాబాద్‌ మాజీ మహిళా అధ్యక్షురాలు మచ్చ వరలక్ష్మి, గ్రేటర్‌ ఏలే నరేందర్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు చేనేత విభాగం కోనంపేట్‌ నరసింహ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చేనేత విభాగం బొల్ల వెంకటేష్‌ నేత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad