Wednesday, July 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుElectricity Dues : విద్యుత్ బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్

Electricity Dues : విద్యుత్ బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్

- Advertisement -





– దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

నవతెలంగాణ-హైదరాబాద్

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, మొండి బకాయిల వసూలుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. దానిలో భాగంగా బిల్ల్ స్టాఫ్ట్ హెక్టా సర్వీస్ కలిగి ఉన్న ప్రాంగణాల ముందు తమకు రావాల్సిన బకాయిల మొత్తం పేర్కొంటూ నోటీసు బోర్డులను ఏర్పాటు చేసింది. సంస్థ తీసుకుంటున్న ఈ చర్యల వల్ల బకాయిలు వసూళ్లు ఆవుతున్నాయని సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

ప్రస్తుతం, సంస్థ పరిధిల్లో 728 బిల్ స్టాఫ్ట్ హెచ్ కనెక్షన్లు ఉన్నాయనీ, ఆ సర్వీసులు ఇప్పుడు వాడకంలో లేవన్నారు. వీటికి సంబంధించి రూ.600 కోట్లు బకాయిలు ఉన్నాయనీ, బిల్లుల వసూలుకు సంబందించి ఎన్నిసార్లు వారికి సంప్రదించినా ఎలాంటి మార్పు లేకపోడంతో ఈ చర్యలకు పూనుకున్నామన్నారు. అలాగే 9. 19 లక్షల బిల్ స్టాఫ్ట్ హెచ్ఐటీ సర్వీసుల నుంచి దాదాపు రూ.188 కోట్లు రావాల్సి ఉన్నదన్నారు. ప్రస్తుతం అత్యధికంగా ఇకాయిపడ్డ హెచ్లో బిల్ట్ స్టాఫ్ట్ సర్వీసుల నుంచి కావాల్సిన బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.100 కోట్లు వసూలయ్యాయని తెలిపారు.

విద్యుత్ శాఖకు బకాయిపడ్డ విషయం తెలియకుండా కొంతమంది ఆ సర్వీసుకు సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని, యాజమాన్యం మారినా ఆ బకాయిలు చెల్లించనిదే విద్యుత్ కనెక్షన్ ఇవ్వవాదని పలు చట్టాలు పేర్కొంటున్నాయని, అలాంటి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఇప్పటికే విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిల వివరాలను, వాటికి లింక్ చేయబడ్డ అస్తుల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్కు అందజేసినట్టు తెలిపారు. దీనికితోడు జిల్లా కలెక్టర్లకు కూడా బకాయిల వివరాలను అందజేశామని తెలిపారు. ఈ ఇక్బాయిల వసూలుకు చట్ట ప్రకారం ఉన్న ప్రతి అవకాశాన్ని సంస్థ సద్వినియోగం చేసుకునేలా తగు ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -