Friday, November 21, 2025
E-PAPER
Homeజాతీయంఅల్‌ ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై ప్రత్యేక దర్యాప్తు

అల్‌ ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై ప్రత్యేక దర్యాప్తు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అల్‌ ఫలా యూనివర్శిటీ కార్యకలాపాలపై నిఘా కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేసినట్లు ఫరీదాబాద్‌ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఇద్దరు అసిస్టెంట్‌ కమిషనర్స్‌ ఆఫ్‌ పోలీస్‌, ఇన్‌స్పెక్టర్‌ మరియు ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన సిట్‌యూనివర్శిటీ కార్యకలాపాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తోందని అన్నారు. ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలా యూనివర్శిటీ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశామని, అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఫరీదాబాద్‌ పోలీస్‌ ప్రతినిధి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి యూనివర్శిటీకి చెందిన పలువురు వైద్యులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.
దర్యాప్తు సంస్థలు క్యాబ్‌ డ్రైవర్‌, మతాధికారి, ఉర్దూ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబ్‌ డ్రైవర్‌ ధౌజ్‌ గ్రామానికి చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు నుహ్ జిల్లాకు చెందిన వారని పేర్కొన్నాయి. సోహ్నా సమీపంలోని రాయ్‌పూర్ గ్రామంలోని షాహిజామా మసీదు నుండి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -