నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధానిలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం రాత్రివేళ ఢిల్లీ వ్యాప్తంగా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో కానిస్టేబుళ్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలోని సివిల్ లైన్, డిఫెన్స్ కాలనీ, ఐటీం, ఇతర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) ఎస్.కె. జైన్ మీడియాకు తెలిపారు. ఈ తరహా పెట్రోలింగ్ ప్రతి నెల చివరి రోజుల్లో నిర్వహిస్తామని, దేశరాజధాని భద్రతా చర్యల్లో భాగంగా పలు తనిఖీలు చేపడుతామని, నగర సరిహద్దుల్లో మొదలుకొని పలు కీలక ప్రాంతాల్లోవాహనాల తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.
“ప్రతి నెలా, ఢిల్లీ పోలీసులు అన్ని స్థాయిల అధికారులు క్షేత్రంలో ఉండేలా సాధారణ గస్తీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుంచి గస్తీ నిర్వహించి. ఢిల్లీ అంతటా దాదాపు 45 పికెట్లను ఏర్పాటు చేశాం. ఈ ప్రత్యేక గస్తీలో భాగంగా ముఖ్యంగా రాత్రిపూట అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టడమే మా ప్రధాన లక్ష్యం’ అని ఎస్.కె. జైన్ చెప్పారు.