– నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరదల నివారణకు రాష్ట్రంలో ప్రత్యేక ”నోడల్ ఏజెన్సీ”ని ఏర్పాటు చేస్తున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్య్లూసీ), కష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ”వరద మైదానాల జోనింగ్, ప్రాంతీయ స్థాయి శిక్షణా శిబిరం”లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆధునిక పరిజ్ఞానంతో వరదల వల్ల సంభవిస్తున్న విపత్తులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. 2020 హైదరాబాద్ వరదలు, గతేడాది ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగి పొర్లడం లాంటి ఉపద్రవాలు అనేక గుణపాఠాలు నేర్పాయన్నారు.
వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



