- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని గూడూరులో సరస్వతి ఆలయంలో గురువారం గూడూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పట్టూరి శ్రీనివాస్ జ్యోతిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పాలకుర్తి నుండి గూడూరుకు తరలి వెళ్లిన మహిళలు సరస్వతి ఆలయంతో పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళలు ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా వడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం మహిళ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -