Thursday, May 1, 2025
Homeజిల్లాలుఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి

  • మంత్రి దనసరి సీతక్క
  • నవతెలంగాణ -గోవిందరావుపేట
  • రాఘవ పట్నంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం  మండలం లోని రాఘవ పట్నం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకుంటున్న పొన్నం రవీందర్, ధనసరి లింగయ్య, కృష్ణ వేణి కోరం రామ్ మోహన్ లతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.  మంజూరైన ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలనీ అన్నారు. రెండవ దఫా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని  ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.  వివిధ కారణాలు చూపి ప్రజలకు ఇండ్లు ఎగ్గొట్టే ఉద్దేశం ప్రజాప్రభుత్వానికి లేదని, రాబోయే నాలుగేళ్ల గూడు లేని ప్రతి పెదోడికి ఇల్లు నిర్మించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ప్రతి దశలో ఇంటి నిర్మాణ పురోగతి వివరాలు ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో నమోదు చేయబడతాయని తెలిపారు.అనంతరం మంత్రి సీతక్క బోర్ వేల్ ను ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సృజన్ కుమార్ఎం పి ఓ మమత ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img