Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే 

- Advertisement -

– జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ 
నవతెలంగాణ –  కామారెడ్డి, బీబీపేట్ :  బిబిపేట మండలంలోని  జనగామ గ్రామంలో శనివారం  సీఎం కాంప్ 25 – 26 కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీని గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ పాత స్వామిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి మొదలుకొని బస్టాండ్, గ్రామ వీధుల గుండా ర్యాలీ కొనసాగించి సీఎం కాంప్ పథకం వివరాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు  అంతే ముఖ్యమనీ ప్రతి విద్యార్థి ఏదో ఒక ఆటలో ప్రావీణ్యులై ఉంటారని వారికి ఆ ఆటలు నేర్పిస్తే జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు.  ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  వార్డు వార్డు సభ్యులు వంశీ. నర్సింహా చారి  పంచాయతీ కార్యదర్శి కసి కళ్యాణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  ప్రవీణ్ కుమార్, తెలుగు టీచర్ కృష్ణ, ప్రణిత, రేణుక, పల్లవి, గ్రామ  కరోబార్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -