– సర్పంచ్ బండి శ్రీనివాస్
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ పర్వదినం పురస్కరించుకొని ముగ్గుల పోటీలు కబడ్డీ పోటీలు తో పాటు కొన్ని క్రీడలను నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమాన్ని గ్రామ శాఖ అధ్యక్షుడు పాశం రమేష్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ పర్వదినం పురస్కరించుకొని గ్రామంలో క్రీడలతో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు దీనిలో యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడలు ఆడి ప్రతిభ కనబరిచారని అన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రధానం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు
రామన్నగూడెం గ్రామంలో క్రీడలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



