Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్మంత్రి పర్యటనపై ఎస్పీ ప్రత్యేక దృష్టి..

మంత్రి పర్యటనపై ఎస్పీ ప్రత్యేక దృష్టి..

- Advertisement -

– వర్షంలో గొడుగు సాయంతో బందోబస్తు పరీశీలింస్తున్న ఎస్పీ
నవతెలంగాణ – ముధోల్

ముధోల్  నియోజకవర్గంలో మంగళవారం జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క పర్యటన ఉండడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బందోబస్తు స్వయంగా పరిశీలించారు. ముధోల్  మండలంలోని బ్రహ్మణ్ గావు గ్రామంలో మంత్రి పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వచ్చిన నేపథ్యంలో ముందుగా గ్రామానికి కురుస్తున్న వర్షంలో ఎస్పీ వచ్చారు. బందోబస్తు వివరాలను ముధోల్ సిఐ మల్లేష్ ఎస్సై సంజీవ్ ను అడిగి తెలుసుకున్నారు. వర్షంలోనే  బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

మంత్రి పర్యటనలో  ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎస్పి సూచించారు. ఇటీవల మంత్రి పొంగులేటి కార్యక్రమం  సందర్భంగా కుంటాల మండలంలో అక్కడ బీఆర్ఎస్ నాయకులు  నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. దీంతో ఇలాంటి సంఘటనలను  మళ్లీ పునరావృతం కాకుండా జిల్లా ఇంచార్జి మంత్రి పర్యటనలో బాగంగా జిల్లా ఎస్పీ ముందస్తు చర్యలు తీసుకున్నారు ‌. బందోబస్తులో భాగంగా మంత్రి వచ్చే రూట్లలో ఆయా గ్రామాల వద్ద ముందుగానే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ బిజెపి కార్యకర్తలను మంగళవారం ఉదయం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం వారిని సొంత పూచికత్తుపై వదిలిపెట్టారు. మంత్రి పర్యటన  సజావసాగడంతో పోలీసులు ఊపిరి పిలుచుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad