- Advertisement -
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు
-నవతెలంగాణ-పెద్దవూర : పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచిగా ఎన్నికైన తుడుం శ్రావణి రాకేష్ ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే గ్రామంలో అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారు. గ్రామంలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉండగా బుధవారం సొంత ఖర్చులతో గ్రామంలోని అన్నీ వీధుల్లో లైట్లు వేయించారు. వార్డు సభ్యులతో పాటు ప్రజలందరితో పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. గ్రామ ప్రజలు మేము సర్పంచి వెంటే అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



