- Advertisement -
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం 2026 సంవత్సరానికి సంబంధించి..నూతన క్యాలెండర్‌ను దేవస్థాన చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి కార్యనిర్వహణ అధికారి సల్వాది మోహన్ బాబు గురువారం దేవాలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ స్కూల్ చైర్మన్ కె.వి.బి.కృష్ణారావు ప్రిన్సిపాల్ వి.మంజులతో పాటు జూనియర్ అసిస్టెంట్ సత్తిరెడ్డి పలువురు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యాజమాన్యం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్ మల్లారెడ్డి తెలిపారు
- Advertisement -



