Thursday, May 1, 2025
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మార్కండేయ స్వామి విగ్రహాల ఊరేగింపు

ఘనంగా మార్కండేయ స్వామి విగ్రహాల ఊరేగింపు

-మహిళల కోలాటం ఇంటింటికి మంగళహారతులు. 
– కన్నుల పండుగ ఉత్సవాలు

నవతెలంగాణ-రాయపోల్ : రాయపోల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భక్త మార్కండేయ స్వామి ఉత్సవాలు సోమవారం వైభవంగా కొనసాగాయి. ఇందులో భాగంగానే మార్కండేయ స్వామి ఆలయం నుంచి విగ్రహాల ఊరేగింపు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అంతకుముందు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాల ఊరేగింపు ముందుకు కొనసాగింది. భారీ సంఖ్యలో మహిళల  కోలాటం, యువకుల భక్తి ప్రావస్యం, ఇంటింటికి మంగళ హారతులు ఇవ్వడంతో విగ్రహాల ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. ఉదయం ఆలయం నుంచి విగ్రహాలను ప్రత్యేక వాహనంలో ఊరేగింపును ప్రారంభించారు. గ్రామ పురవీధుల్లో ప్రతి ఇంటి నుంచి మంగళ హారతి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పద్మశాలి సంఘం కులస్తులు కూడా ఇంటింటా మంగళారతులు అందించి ముక్కులు చెల్లించుకోవడంతో శ్రీ భక్త మార్కండేయ విగ్రహాల ఊరేగింపు గ్రామస్తులు, భక్తులు, పద్మశాలి సంఘం సభ్యులు ముందుకు సాగుతూ ఊరేగింపు కొనసాగింది. మార్కండేయ స్వామి ఉత్సవాల్లో మొదటిరోజు ఆలయం నుంచి గ్రామ పురవీధుల్లో భక్తుల దర్శన భాగ్యం కోసం స్వామివారి మొక్కులు చెల్లించుకోవడానికి ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మంగళవారం,బుధవారం ప్రతిష్ట ఉత్సవాలు కొనసాగనున్నాయి. కాగా మార్కండేయ స్వామి ప్రతిష్ట ఉత్సవాలకు హాజరవుతున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా బుధవారం భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ట ఉండడంతో గ్రామ పద్మశాలి సంఘం కుటుంబ సభ్యులు వారి బంధువులు,భక్తులు ఇప్పటికే గ్రామానికి చేరుకోవడంతో రాయపోల్ మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img