Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంసీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు

సీబీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా శ్రీచైతన్య విద్యాసంస్థ నిలిచింది. 498 టాప్‌ మార్కులతో రికార్డు సృష్టించింది. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 497 ఆపైన ఆరుగురు, 496 ఆపైన మార్కులు పది మంది, 495 ఆపైన మార్కులను 26 మంది, 490 ఆపైన మార్కులను 197 మంది, 480 ఆపైన మార్కులను 917 మంది విద్యార్థులు సాధించారని వివరించారు. అత్యధిక బ్రాంచీలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణతను సాధించాయని తెలిపారు. అత్యధిక మార్కుల్లో, ఉత్తీర్ణత శాతంలో, సగటు మార్కు ల్లో దేశంలోని ఏ ఇతర విద్యాసంస్థ ఈ ఫలితాలను సాధించలేదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -