వేడుకలకు హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
హాజరైన టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలం వావిలాల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ శ్రీ కంఠమ మహేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి , మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి లకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
వారి వ్యక్తిగత సహాయకులు (పి ఏ) మద్దెల రాజేష్ ఆహ్వానం మేరకు వారు వావిలాల గ్రామానికి విచ్చేసి, గ్రామ ప్రజలతో ఆప్యాయంగా కలిసిమెలిసి మాట్లాడారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కంఠమ మహేశ్వర స్వామి వారి తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



