నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దుతో పాయింట్ల పట్టికలో కివీస్ ఒక్క పాయింట్‌తో రెండో స్థానంలో నిలువగా, ఇంగ్లాండ్ జట్టుపై ఓడిన ఆతిథ్య టీం శ్రీలంక చివరి స్థానంలో ఉన్నది. సెమీస్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యంత కీలకం.
తుది జట్లు
శ్రీలంక: పాథున్ నిశాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకె, కమిందు మెండిస్, డాసున్ శనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగె, దుషాన్ హేమంత, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోలె మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఐష్ సోధి, లాకీ ఫెర్గూసన్



