Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంశ్రీ రాముడు నేపాల్‌లో జ‌న్మించాడు: నేపాల్‌ ప్రధానమంత్రి

శ్రీ రాముడు నేపాల్‌లో జ‌న్మించాడు: నేపాల్‌ ప్రధానమంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: శ్రీ రాముడి జన్మస్థలంపై నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ దేశంలోనే జన్మించాడని అన్నారు. సోమవారం ఖాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఆయన గతంలోనూ ఈ విధంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2020లో అయోధ్య తమ దేశంలోని చిత్వాన్‌లోని థోరిలో ఉందని అన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని చెప్పారు. ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు. రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు. దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని తెలిపారు. అంతేకాదు, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని… ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందన్నారు. ఇతిహాసాల్లో ప్రస్తావించిన ప్రదేశాలు ఇప్పుడు తమ దేశంలోని సున్‌సారి జిల్లాలోనే ఉన్నాయని ఓలి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -