Thursday, May 1, 2025
Homeతెలంగాణ రౌండప్శ్రీకాంత చారి మెమోరియల్ అవార్డులు పొందిన ఉద్యమకారులు

శ్రీకాంత చారి మెమోరియల్ అవార్డులు పొందిన ఉద్యమకారులు

నవతెలంగాణ- రాయపోల్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడు శ్రీకాంత చారి మెమోరియల్ అవార్డులను రాయపోల్ మండలాలకు చెందిన అప్పటి తెలంగాణ ఉద్యమకారులు అవార్డులకు ఎంపికయ్యారు. బుధవారం బడంగ్ పేట్, బాలాపూర్ హైదరాబాద్ లో నింగి నేల మేము సైతం సంస్థ వారు రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ఇప్ప దయాకర్, రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తుడుం స్వామి, దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మండల జేఏసీ కన్వీనర్ ఉద్యమకారుడు సరవుగారి యాదవ రెడ్డిలతో పాటు పలు గ్రామాలకు చెందిన ఉద్యమకారులకు శ్రీకాంతాచారి మెమోరియల్ అవార్డులను ప్రముఖ కళాకారుడు ఓయూ జెఏసి చైర్మన్ దరువు అంజన్న, ట్రస్ట్ మెమోరియల్ సభ్యులతో కలిసి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మళి దశ ఉద్యమంలో శ్రీకాంత్ చారి అమరుని స్ఫూర్తితో ముందుకు సాగుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. శ్రీకాంత్ చారి త్యాగం వేల కట్టలేనిదని వారు పేర్కొన్నారు. సీమాంధ్ర పాలకులను ఎదిరించి తెలంగాణ సాధించుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నింగి నేల మేము సైతం సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img