Thursday, May 1, 2025
Homeతెలంగాణ రౌండప్సుల్తానకు శ్రీకాంతా చారీ మెమోరియల్ అవార్డు

సుల్తానకు శ్రీకాంతా చారీ మెమోరియల్ అవార్డు

నవతెలంగాణ- రాయపోల్ : తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించి పోరాడిన ఉద్యమకారులకు, వివిధ రంగాలలో ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించిన సామాజిక కార్యకర్తలకు శ్రీకాంతా చారీ మెమోరియల్ అవార్డులు అందజేయడం జరిగిందని ఎమ్మెల్సీ మధుసూదన చారి, శ్రీకాంత్ చారి మాతృమూర్తి శంకరమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మదన్మోహన్, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న అన్నారు. బుధవారం పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్, బడంగ్ పేట్, బాలాపూర్ హైదరాబాద్ లో శ్రీకాంత్ చారి మెమోరియల్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి గురించి చేసిన పోరాట పటిమను గుర్తించి ఎంతో మంది ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేశారని వారి త్యాగాలు వెలకట్టలేమని భావించి తెలంగాణ మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి మెమోరియల్ అవార్డును తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో నింగి నేల మేము సైతం సంస్థ వారు తెలంగాణ ఉద్యమకారులకు, వివిధ రంగాలలో సేవలు అదించిన సామాజిక ఉద్యమకారులకు అందజేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 11 సంవత్సరాలు గడిచిన అమరవీరులకు, నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు లేదన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు అధికారంలోకి వచ్చి పదవులు అనుభవిస్తున్నారు. శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మకు ఎన్నో హామీలను ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు. అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ కు శ్రీకాంతాచారి మెమోరియల్ అవార్డును అందజేశారు. అనంతరం సుల్తాన ఉమర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సామాజిక కార్యకర్తలకు నింగి నేల మేము సైతం సంస్థ వారు అందజేసిన శ్రీకాంత్ చారి మెమోరియల్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ అవార్డును అందజేసిన నింగి నేల మేము సైతం సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నింగి నేల మేము సైతం ప్రతినిధులు కుందరం గణేష్ చారి,కృష్ణమ చారి,విష్ణుకిశోర్,వెంకట చారి,కానిస్టేబుల్ శ్రీనివాస్, కళాకారులు బాలు, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img