అనుమతులు లేని ల్యాబ్ లు పైనా చర్యలు..
డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి
నవతెలంగాణ – అశ్వారావుపేట : అనుమతులు లేకుండా ఆస్పత్రులు,క్లినిక్ లు, రక్తపరీక్ష కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.జయలక్ష్మీ హెచ్చరించారు. వీరితో సహా జిల్లా వైద్యబృందం బుధవారం అశ్వారావుపేట లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో పలు ప్రయివేట్ ఆస్పత్రులను, రక్తపరీక్షలు కేంద్రాలను వారు తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మి నర్సింగ్ హోమ్ ను తాళం వేసి సీజ్ చేసారు.
ప్రయివేట్ ఆస్పత్రులు, క్లినిక్ లు, డయాగ్నస్టిక్ సెంటర్ లు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం యొక్క మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. అనుమతి లేకుండా ఆస్పత్రి, క్లినిక్, డయాగ్నస్టిక్ సెంటర్ లను నిర్వహించ వద్దని, రోగులు సైతం నిపుణులైన, అర్హత కలిగిన వైద్యులు వద్దకే వెళ్ళాలని వారు సూచించారు. ఆమె వెంట వైద్యారోగ్యశాఖ బృందం సభ్యులు డీఆర్ ఏ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధు వరుణ్,డిప్యూటీ డీఈఎంఓ ఎండీ ఫైజుద్దీన్ లు ఉన్నారు.