నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ ప్రాంతానికి చెందిన పెంకుల బాబు ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ శ్రీమాత సేవ చారిటబుల్ సంస్థ సభ్యులు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ సంస్థ సభ్యులు సాయిరాం, నారాయణరావు, గంగాధర్, చక్రధర్ రావు, 13వ వార్డ్ కౌన్సిలర్ చిట్టీబాబు, గోపాల్ రావు, రాజు నరసింహులు, టీచర్ రాజు తదితరులు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబానికి రూ. 6,300 నగదు సహాయం తో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా తమవంతు సహాయం అందిస్తామని, కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సహాయం అందించినందుకు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు శ్రీమాత సేవ చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త, వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.



