Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మెన్‌గా శ్రీనివాస్‌రెడ్డి

అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మెన్‌గా శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -

– సభ్యులుగా ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శి బసవపున్నయ్య
– 15 మందితో కొత్త కమిటీ నియామకం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పొలిటికల్‌ ఎడిటర్‌ ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చైర్మెన్‌గా మరో 14 మందితో కమిటీని నియమిస్తూ శాసనమండలి, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి. నర్సింహ్మచార్యులు ఉత్తర్వులు ఇచ్చారు. కమిటీ కో చైర్మెన్‌గా ఎన్టీవీ రిపోర్టర్‌ పి.పరిపూర్ణాచారి, సభ్యులుగా నవతెలంగాణ స్పెషల్‌ కరెస్పాండెంట్‌, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నియమితులయ్యారు. అలాగే అయితరాజు రంగారావు, బి. పూర్ణచందర్‌రావు, ఎల్‌.వెంకట్‌రాంరెడ్డి, పి. ఆంజనేయులు, ఎం.పవన్‌కుమార్‌, బీ. అశోక్‌, బి. ఆంజనేయులుగౌడ్‌, సురేఖ అబ్బూరి, ఎండీ నయీమ్‌ వజాహత్‌, ప్రమోద్‌కుమార్‌ చతుర్వేది, సుంచు అశోక్‌, బిహెచ్‌ఎంకె గాంధీ తదితరులు సభ్యు లుగా నియమితులయ్యారు. 2025-27 సంవత్సరాలకు ఈ కమిటీ పనిచే స్తున్నది. అసెంబ్లీ మీడియా వ్యవహారాలు, జర్నలిస్టులకు పాసుల జారీ, విధివి ధానాల ఖరారు తదితర బాధ్యతలను మీడియా అడ్వైజరీ కమిటీ నిర్వహించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -