ఆదేశాలు జారీ చేసిన డీజీపీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
సిసిఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు విచారణ అధికారిగా నియామకం చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నేరస్తుడు రియాజ్ ను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( జీజీహెచ్లో ) చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ తప్పించుకునే యత్నం చేయగా పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపారు. దీనిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటాగా స్వీకరించింది. నవంబర్ 24లోగా ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్కౌంటర్పై విచారణకు ఎల్లారెడ్డి డీఎస్పీని డీజీపీ నియమించారు. ఈ విచారణ భారీ బందోబస్తు మధ్య అత్యంత గోప్యంగా చేపడుతున్నట్లు తెలిసింది.
రియాజ్ ఎన్కౌంటర్పై విచారణ అధికారిగా శ్రీనివాసరావు నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES