Monday, September 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ్రీరామ్‌సాగర్‌ 8 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీరామ్‌సాగర్‌ 8 గేట్లు ఎత్తి నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్‌: శ్రీరామ్‌సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1088 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 72.23 టీఎంసీలుగా నమోదైంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -