- Advertisement -
నవతెలంగాణ-ఊరుకొండ: ఊరుకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్ బాలు(40) గురువారం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం తెలియజేశారు. తక్షణ సహాయం కింద ఊరుకొండ పోలీస్ స్టేషన్ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వెంకోజీ. శ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, రామకృష్ణ, శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -



