Saturday, August 23, 2025
E-PAPER
spot_img
HomeజాతీయంSSC ఎగ్జామ్స్‌లో అవకతవకలు..అభ్యర్థుల భారీ ర్యాలీ

SSC ఎగ్జామ్స్‌లో అవకతవకలు..అభ్యర్థుల భారీ ర్యాలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వేలాదిమంది అభ్యర్థులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే SSC ఎగ్జామ్స్ లో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల పలు కేంద్రాల్లో చివరి నిముషంలో పరీక్ష రద్దు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అలాగే తరుచూ పరీక్ష సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.

పరీక్షా కేంద్రంలో సిబ్బంది అభ్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలతో విసిగిపోయిన అభ్యర్థులు వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని వారంతా డిమాండ్ చేస్తూ, ప్లక్కార్డులు ప్రదర్శించారు. వేలాది మంది అభ్యర్థులు రోడ్డెక్కడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad