Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెయింట్ మేరీ స్కూల్ తనిఖీ 

సెయింట్ మేరీ స్కూల్ తనిఖీ 

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి : మండలంలోని కాట్రపల్లి గ్రామ శివారులోని సెయింట్ మేరీ స్కూల్ ను మంగళవారం జిల్లా జడ్పీ సీఈఓ రాంరెడ్డి తనిఖీ చేశారు. స్కూల్లోని టీచర్ల విద్యా అర్హత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూలు నిర్వహించబడుతుందా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి ఫీజు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ నిర్వహించబడుతున్న రికార్డులను పరిశీలించారు. స్కూల్ డైరెక్టర్ల వివరాలు, బైల నిబంధనలను పరిశీలించారు. స్కూలుకు పక్క భవనం ఉండాలని తెలిపారు. తనిఖీ చేసిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తానని తెలిపారు. ఆయనతోపాటు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -