Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఒడిశాలో ఓ ఇంజ‌నీర్ ఇంట్లో గుట్ట‌లుగా నోట్ల క‌ట్ట‌లు

ఒడిశాలో ఓ ఇంజ‌నీర్ ఇంట్లో గుట్ట‌లుగా నోట్ల క‌ట్ట‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒడిశాలో అవినీతి తిమింగలం ప‌ట్టుబ‌డింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఓ ఇంజ‌నీర్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేప‌ట్ట‌గా.. నోట్ల క‌ట్ట‌లు గుట్ట‌లుగా ద‌ర్శ‌న‌మించాయి. ఒడిశాలోని గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న బైకుంత నాథ్ సారంగి ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అతడికి సంబంధించిన ఇళ్లు, బంధువులు ఇళ్లు కలిపి మొత్తం 7 చోట్ల ఏక‌కాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బైకుంత నాథ్ అవినీతి దాహం ఎంతలా పాతుకుపోయిందో చూసి అధికారులు షాక్ తిన్నారు. తనిఖీల కోసం అధికారులు అంగుల్ లోని కరడిగాడియాకు రావడం గమనించిన బైకుంత నాథ్ వెంటనే తన రెండంతస్తుల బిల్డింగ్ లో దాచుకున్న నోట్ల కట్టలను కిటికిలో నుంచి బయటకు విసిరేశాడు. అతడి బాగోతం అంతా గమనించిన అధికారులు ఆ నోట్లకట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.1 కోట్లు ఉందని భువనేశ్వర్ లోని ఇంకో ఫ్లాట్ లో మరో కోటి రూపాయల నగదు దొరికినట్లు అధికారులు తెలిపారు. అతడి ఇంట్లో లభించిన నోట్ల కట్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad