Wednesday, November 5, 2025
E-PAPER
Homeజాతీయం‘తాయుమనవర్‌ తిట్టం’ పథకాన్ని ప్రారంభించిన స్టాలిన్‌

‘తాయుమనవర్‌ తిట్టం’ పథకాన్ని ప్రారంభించిన స్టాలిన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌ – చెన్నై  :  రాష్ట్రవ్యాప్తంగా 21.7లక్షలకు పైగా వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేసే ‘తాయుమనవర్‌ తిట్టం’ పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం ప్రారంభించారు. ప్రతి నెలా రెండవ శనివారం, ఆదివారం లబ్ధిదారుల ఇంటివద్దకే పంపిణీ చేయనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్‌) కింద 70 ఏళ్లు పైబడిన 20,42,657మంది వృద్ధులు, 1,27,797మంది విభిన్న ప్రతిభావంతులకు 34,809 రేషన్‌ దుకాణాల నుండి సరుకు పంపిణీ చేయనున్నారు.రీ పథకం కోసం రూ.30.16 కోట్ల అదనపు ఖర్చు చేయనున్నామని, ప్రజలకు సేవ చేయడం, రక్షించడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నామని స్టాలిన్‌ పేర్కొన్నారు. తనకు ఇష్టమైన కార్యక్రమాల్లో ఇది ఒకటని, ఈ చొరవ దేశానికి ఆదర్శమని అన్నారు. నాలుగేళ్లలో 2,394 రేషన్‌ దుకాణాలను ప్రారంభించినట్లు గుర్తు చేసుకున్నారు. చెన్నైలోని తొండియార్‌పేటలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పి.కె.శేఖర్‌ బాబు, పలువురు ఎమ్మెల్యేలు సహా సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -