Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతొక్కిసలాట బాధితులకు స్టాలిన్‌ పరామర్శ

తొక్కిసలాట బాధితులకు స్టాలిన్‌ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడి కరూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 39 మంది మృతిచెందారని తెలిపారు. రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -