- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు ప్రజలకు స్టాలిన్ ప్రభుత్వం రూ.6,936 కోట్లతో సంక్రాంతి కానుకలు అందిస్తోంది. రేషన్ కార్డు ఉన్న 2.22 కోట్ల కుటుంబాలకు రూ.3వేలతో పాటు కేజీ బియ్యం, కేజీ చక్కెర, చెరకు గడ, చీర, ధోతి ఉచితంగా పంపిణీ చేస్తోంది. రేషన్ దుకాణాల వద్ద రద్దీ లేకుండా ముందే ఇంటింటికీ టోకెన్లు అందించారు. దాంట్లో ఉన్న తేదీ ప్రకారం జనవరి 12 వరకు దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు. కాగా ఏపీ, టీజీలో ఇలాంటి స్కీమ్ లేదు.
- Advertisement -



