- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు. జనసేన తెలంగాణ నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితులకు ధైర్యం చెప్పి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. మూసీ వరదతో ఎంజీబీఎస్ తో పాటు పరిసరాలు నీటమునిగాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు.
- Advertisement -