- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే సపోర్టుతో కమల్ రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. కమల్ ను ఎగువ సభకు పంపాలన్న అంశంపై మక్కల్ నీది మయ్యం పార్టీ తీర్మానం చేసింది. ఎంఎన్‌ఎం రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపించనున్నట్లు ఎంఎన్ఎం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు దీనిని డీఎంకే కూడా ధృవీకరించింది. 2024 తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల పొత్తు సందర్బంగా ఎమ్ఎన్ఎమ్ కు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అధికార డీఎంకే అంగీకరించింది. దాని ప్రకారమే తాజాగా రెండు పార్టీల నుంచి ప్రకటన వచ్చింది.
- Advertisement -