నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వంగ రామయ్య పల్లి సర్పంచ్ భూక్య రాజేశ్వరి తిరుపతి నాయక్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్య పల్లి గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ఈద్ ముబారక్ తోఫా లను సర్పంచ్ రాజేశ్వరి తిరుపతి నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బందెల హరీష్ బాబు, రవి నాయక్, రాజు నాయక్, కొమురయ్య, బాబు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



