అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు :
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు విక్రయించి ప్రజలపై భారం మోపినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిహెచ్చరించారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా లాభాలు సంపాదించాలనుకునే వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.బియ్యం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం హైదరాబాద్ బేగంపేట కుందన్ బాగ్ లోని తన క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో శుక్రవారం సమీక్షించారు. టోకు, చిల్లర వ్యాపారులు, రైస్‌మిల్లర్లతో పౌర సరఫరాల శాఖ అధికారులు జరిపిన చర్చల వివరాలను తెలుసుకున్నారు. అక్రమాల నిరోధానికి చేపట్టిన ప్రత్యేక చర్యలు, తనిఖీల పురోగతిని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంత్రికి వివరించారు.
బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)