నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే విద్యారంగంలో సంస్కరణలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) కోరింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్.రోహిత్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ఏకపక్షంగా తీసుకుంటున్న విధానలతో విద్యా వ్యవస్థకు నష్టం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు పనులతో ఉపాధ్యాయులపై భారం మోపడం వ్యవస్థీకృత నేరమని వారు పేర్కొన్నారు.





కామెంట్‌లు (0)