Magazines

మోడీ ఫాసిస్టు పాలనకు నూకలు చెల్లుతాయి

1 గంట క్రితం

Modi’s fascist rule is nearing its end.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీ వెళ్లి తీరతాం : పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై
 కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

దక్షిణ మధ్య రైల్వే జీఎం కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

మోడీ ఫాసిస్టు పాలనకు నూకలు చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ ఒకటిన తలపెట్టిన నిరసన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైళ్లను కేటాయించటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఢిల్లీకి వెళ్లి తీరుతామని హెచ్చరించారు. ఓట్ బచావో - దేశ్ బచావో నిరసనను విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్‌‌కు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌‌ను తొలగించాలనే ప్రధాన డిమాండ్‌‌పై ఏఐసీసీ ఆధ్వర్యంలో నవంబరు ఒకటిన ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన ధర్నాకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను కేటాయించాలని టీపీసీసీ... దక్షిణ మధ్య రైల్వే జీఎమ్‌‌ను కోరింది.

అందుకు ఆయన నిరాకరించటంతో సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బుధవారం మెరుపు ధర్నా చేపట్టారు. తమ వినతిని నిరాకరించడంతో మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు అక్కడికక్కటే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రత్యేక రైళ్లను కేటాయించకుండా ప్రధాని మోడీ, బీజేపీ అడ్డుకుంటున్నాయంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేశ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో ఎంపీ రఘురామ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఉద్దేశపూర్వకంగానే నిరాకరణ

ఢిల్లీ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్‌ ‌నేతలను అడ్డుకునేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను కేటాయించటంలేదని మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా విమర్శించారు. ధర్నా అనంతరం ఆయన డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ చైర్మెన్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రైళ్లను కేటాయించక పోవటం వెనుక ప్రధాని మోడీ కుట్ర దాగుందని దుయ్యబట్టారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి ప్రత్యేక రైళ్ల కోసం దక్షిణ మధ్య రైల్వే జీఎమ్‌‌కు ఆరు రోజుల ముందే దరఖాస్తు చేశారని తెలిపారు. ఇప్పటి వరకూ దానిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి చివరి నిమిషంలో రైళ్లను కేటాయించలేమని దరఖాస్తును తిరస్క రించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఢిల్లీ నిరసనలకు తెలంగాణ నుంచి భారీగా తరలి వెళ్లాల్సిన అవసరముందని తెలిపారు. అందుకోసం అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, పొన్నం ప్రభాకర్, వాటికి శ్రీహరిలతో కమిటీ వేసినట్టు తెలిపారు. బస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏదైమైనా రామ్‌‌లీలా మైదానంలో నిర్వహించబోయే ఆందోళనకు రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో తరలొచ్చి జయప్రదం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

- మహేశ్ కుమార్ గౌడ్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్