Magazines

అక్టోపస్‌ ఆపరేషనల్‌ ‌మాక్‌ ‌డ్రిల్‌

5 రోజుల క్రితం

అక్టోపస్‌ ఆపరేషనల్‌ ‌మాక్‌ ‌డ్రిల్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

వివిధ విభాగాలకు చెందిన 130 మందితో విన్యాసాలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అక్టోపస్‌ ఎకో స్వాట్‌ ‌బృందం ఎస్‌‌వోసీ, డీఎప్పీ బి మరియదాస్‌ ‌నాయకత్వంలో వివిధ శాఖల సమన్వయంతో శుక్రవారం హైదరాబాద్‌‌లోని రాష్ట్ర సచివాలయంలో అక్టోపస్‌ ఆపరేషనల్‌ ‌మాక్‌ ‌డ్రిల్‌ ‌నిర్వహించింది. భద్రతాపరమైన సన్నద్ధతను మరింత పెంపొందించడం, వివిధ సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందనా సమయాన్ని తగ్గించడం, క్లిష్ట పరిస్థితుల్లో విధుల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడం లక్ష్యంగా అక్టోపస్‌ ఆపరేషనల్ విన్యాసాలు, మాక్ డ్రిల్స్‌ ను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలంగాణ సచివాలయం భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు, అన్ని అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అక్టోపస్‌ పాల్గొన్న అన్ని శాఖలు తమ నిబద్ధతను మరోసారి చాటుకున్నాయి. సచివాలయ భద్రత, రక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని ఈ విన్యాసం స్పష్టం చేసింది. సచివాలయంలో ఏవైనా అనుకోని భద్రతాపరమైన ముప్పులు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగాఎదుర్కొనేందుకు వివిధ భద్రతా, అత్యవసర సేవల విభాగాల సన్నద్ధత, పరస్పర సమన్వయం, స్పందనా సామర్థ్యం, కార్యాచరణ సామర్థ్యాలను అంచనా వేయడం, మరింత బలోపేతం చేయడంలో భాగంగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేసింది. వివిధ శాఖలు, విభాగాలకు చెందిన మొత్తం 130 మంది సిబ్బంది పాల్గొన్నారు. వారి విభాగాల వారీగా బందోబస్తు వివరాలు అక్టోపస్‌ బృందం – 45 మంది, ‌సీఎస్‌‌జీ బృందం – 18 మంది, అగ్నిమాపక శాఖ – 08 మంది, లా అండ్ ఆర్డర్ పోలీస్ – 10 మంది, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ (టీజీఎస్‌‌పీఎఫ్‌) – 36 మంది, ట్రాఫిక్ పోలీస్ – 10 మంది, వైద్య బృందం – 06 మంది, బాంబ్ డిస్పోజల్ (‌బీడీ) బృందం మరియు అసాల్ట్ డాగ్ – 04 మంది మొత్తం: 130 మంది సిబ్బంది పాల్గొన్నారు. అక్టోపస్‌ అడిషనల్ ఎస్పీ (అసాల్ట్ కమాండర్) రఘునందన్ రావు, ‌టీజీఎస్‌‌పీఎఫ్‌ సచివాలయం సీఎస్‌‌వో పి. దేవిదాస్, సచివాలయం ఏసీపీ శంకర్, అక్టోపస్‌ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ మోహన్ రావు, టీజీఎస్‌‌పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్లు పవన్ కుమార్, సత్తయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్