Magazines

ఉస్మానియా టీ-జూడా ఆందోళన పున:ప్రారంభం

1 గంట క్రితం

Osmania T-JUDA agitation resumes
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

అమలుకు నోచని ఉన్నతాధికారుల హామీ

రోగులకు మెరుగైన వైద్య సేవలు..

రెసిడెంట్ వైద్యులకు సరైన శిక్షణా వాతావరణాన్ని

కల్పించడమే ప్రధాన లక్ష్యమన్న జూడాలు

నవతెలంగాణ-సిటీబ్యూరో

​ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనుబంధ ఆస్పత్రుల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మంగళ వారం ఉస్మానియా టీ-జూడా ఆందోళనను పున:ప్రారంభించింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆస్పత్రుల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, అవసరమైన వైద్య పరికరాలు, మందులు ఇతర కీలక వైద్య వనరుల లేమి కారణంగా రోగుల వైద్య సేవ లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. అదే సమయంలో రెసిడెంట్ వైద్యుల క్లినికల్ శిక్షణ, విద్యాభ్యాసం, విధులు నిర్వహించే పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన తొలి దశ ఆందోళన సందర్భంగా ప్రభుత్వం, ఉన్నతాధికారులు 10 రోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనను కొనసాగించొచ్చని కూడా తెలియజేశారు. ప్రభుత్వ హామీపై నమ్మకంతో, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలనే సదుద్దేశంతో ఉస్మానియా టీ-జూడా అదనంగా సమయం ఇచ్చి మొత్తం 14 రోజులపాటు వేచి చూసింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పులు కనిపించ లేదు. రోగుల వైద్య సేవలకు, రెసిడెంట్ వైద్యుల విద్యాభ్యాసం క్లినికల్ శిక్షణ ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.

ఈ పరిస్థితుల్లో, సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి కనిపించకపోవడంతో ఉస్మానియా టీ-జూడా మంగళవారం నుంచి ఆందోళనను పునఃప్రారంభించింది.

తమ ఆందోళన.. రోగులకు అసౌకర్యం కలిగించడం కోసం కాదని జూడాలు స్పష్టం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు రెసిడెంట్ వైద్యులకు సరైన శిక్షణా వాతా వరణాన్ని కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

రోగులకు నాణ్యమైన వైద్యం అందాలన్నా, భవిష్యత్‌ వైద్య నిపుణులకు మెరుగైన శిక్షణ లభించాలన్నా అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, మందులు, ఇతర వనరులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాల‌ని, ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం, ఉన్నతాధికారులపై తమకు ఇంకా నమ్మకం ఉందని, ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకొచ్చి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ దాని అన్ని అనుబంధ ఆస్పత్రుల్లో స్పష్టమైన మార్పులు తీసుకొస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం నిర్మాణా త్మక చర్చలకు, సహకారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

రోగుల సంక్షేమం, రెసిడెంట్ వైద్యుల గౌరవం, వైద్య విద్య నాణ్యత, ప్రభుత్వ వైద్య సంస్థల బలోపేతం కోసం ఉస్మానియా టీ-జూడా తన కృషిని కొనసాగిస్తుందని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లను అత్యవసరంగా పరిగణించి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నతాధికా రులు తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్