క్వింటాల్ రూ.19,089
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు రికార్డు స్థాయిలో ధర రూ.19,089 పలికింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన గుగులోతు లాలు నాయక్ అనే రైతు మంగళవారం ఒక బస్తా పసుపు (కాడి) మార్కెట్కు తీసుకురాగా
ప్రొద్దుటూరు ట్రేడర్స్ ఖరీదు ద్వారా బెజవాడ కనకదుర్గ ట్రేడర్స్ అడితి దారు కొనుగోలు చేశారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది పంట దిగుబడి తగ్గిన ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పసుపు ధరలు మరింత పెరుగుతాయన్న ఆశతో రైతులు మార్కెట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, మంగళవారం ఏనుమాముల మార్కెట్కు రెండు బస్తాలు కాడి పసుపు రాగా గరిష్ట ధర రూ. 19,089 పలుకగా కనిష్ట ధర రూ.14,089 పలికింది. గోలా రకం పసుపు 2 బస్తాలు రాగా గరిష్ట ధర రూ. 18,289 పలుకగా కనిష్ట ధర రూ. 18,000 పలికింది.





కామెంట్లు (0)